Santhosh Kumar: 22 నుండి 7వ విడత గ్రీన్ ఛాలెంజ్..

32
- Advertisement -

తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ మార్చేందుకు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఇప్పటివరకు ఆరు విడతల్లో గ్రీన్ ఛాలెంజ్‌ని పూర్తి చేసుకోగా తాజాగా ఏడో విడత గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభానికి సిద్ధమైంది.

ఈ నెల 22 నుండి ఏడో విడత గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభం కానుందని సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏడోవిడత గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో మాతో చేరండి, భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లో చేరాలని పిలుపునిచ్చారు. భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని కోరారు.

Also Read:KTR:కాంగ్రెస్ కుట్రలే గోదావరిలో కొట్టుకుపోయాయి?

- Advertisement -