తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు వేడుకలు

9
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏపీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. వరదను భరించాలి కానీ, వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఎలా కుదురుతుంది?…వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దివుగ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం అన్నారు.

వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకు?, బనకచర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం ఉండదు అని… బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద జెండాను ఆవిష్కరించారు మల్లారెడ్డి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా.

Also Read:దేశ ప్రజలకు మోదీ శుభవార్త..

- Advertisement -