కష్టించే జీవుల కరువులేదిక్కడ. మట్టిని బంగారం చేసే కర్షకుడున్నాడిక్కడ.. గనుల్లో నల్ల బంగారం తీసే పనిమంతులున్నారిక్కడ.నదులకు కొదువలేదిక్కడ.. అందుకే ఒకప్పుడు దేశం అభివృద్ధి చెందుతున్న దేశం..కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తుండగా వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ.. ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంది.
ఓ వైపు అగ్రదేశాలతో పాటు దేశాలన్ని ఆర్ధికం సంక్షోభంలో కూరుకుపోతుంటే భారత్ మాత్రం వాటిని ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతోంది. గడిచిన మూడు సంవత్సరాల నుండి కరోనా,రష్యా – ఉక్రెయిన్ యుద్ధం,యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు,క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల,నిత్యావసర ధరల పెంపు ఆలా ఎన్నో ఆటంకాలతో ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతున్నాయి. అయితే భారత్‌లో వీటి ప్రభావం కొంతమేర ఉన్న దానిని సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి 7.2%జీడీపీని సాధించి ప్రపంచ దేశాలే నివ్వెరపోయేలా చేసింది.
మొబైల్,ఆటో మొబైల్,ఫార్మా,సోలార్,సెమీ కండక్టర్,ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్,వస్త్ర పరిశ్రమ, ఏవియేషన్, కెమికల్స్,టెలికాం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించడంతో ప్రగతి సాధ్యమైంది. దీంతో పాటు విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించడం అలాగే మౌలిక సదుపాయాలైన రోడ్డు,రవాణా,రైల్వే,వాయు రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది.
ఇక ప్రధానంగా చైనా వ్యాపారానికి సవాల్ విసురుతు ముందుకుసాగుతోంది భారత్. తొలతు స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో యాపిల్ వంటి కంపెనీ భారతదేశానికి రావడం.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో సెమీకండక్టర్ తయారీకి మైక్రాన్ అంగీకరించడం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారును తయారు చేయడానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారతదేశానికి రావడానికి అంగీకరించారు. ఈ విధంగా చైనా వ్యాపారాన్ని భారతదేశం సెలెక్టివ్‌గా సవాలు చేస్తోంది. గతంలో చైనా నుంచి పూర్తిగా తయారైన ఉత్పత్తులు భారత్‌కు వచ్చేవని అయితే ప్రభుత్వం వాటిపై పన్నును పెంచింది. దీంతో అసెంబుల్డ్ ఉత్పత్తులను భారత్‌కు సరఫరా చేసే చైనా యూనిట్లకు ఇప్పుడు ఆర్డర్లు లేకుండా పోయాయి. అదే సమయంలో భారత్‌లో తయారి రంగాన్ని ప్రోత్సహించడం ఇక్కడే అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తయారవుతుండటం మరింత కలిసొచ్చింది.ఐడీసీ లెక్కల ప్రకారం 2023 సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ లో ధరించగలిగే వస్తువుల రవాణా వార్షిక ప్రాతిపదికన 81 శాతం పెరిగింది.
Also Read:‘చిరు’ ఇంటి వంటల్లో అది ఇష్టమట!
మొత్తం దేశానికి ఒకే పన్ను ఉండాలనే ఆలోచనతో 2017లో దేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) ప్రవేశపెట్టారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన గొప్ప పన్ను సంస్కరణలలో ఒకటిగా దీనిపై నిపుణులు అభిప్రాయపడ్డారు. జిఎస్టి కారణంగా, అనేక పన్నులను ప్రభుత్వం ఉపసంహరించింది, కారణంగా కాస్కేడింగ్ (పన్ను మీద పన్ను) ప్రభావాన్ని తొలగించడానికి వీలైంది.దీంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందగా ఈ కామర్స్ విస్తరణకు చాలా అవకాశాలు ఏర్పడ్డాయి. పన్ను రేటు తగ్గించడం ద్వారా వస్తువుల ఉత్పత్తి సరఫరాకు ప్రయోజనం చేకూరింది.
దేశ అభివృద్ధికి కొత్త ఊపును అందించడానికి బయోటెక్ రంగం చాలా ముఖ్యమైనది . ఒక స్పష్టమైన ప్రణాళికతో బయోటెక్ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. గత 8 సంవత్సరాలలో మన దేశంలో స్టార్టప్‌ల సంఖ్య కొన్ని వందల నుండి 70 వేలకు పెరిగింది. ఇందులో 5 వేలకు పైగా స్టార్టప్‌లు బయోటెక్ రంగానికి సంబంధించినవే. అటల్ ఇన్నోవేషన్ మిషన్ , మేక్ ఇన్ ఇండియా మరియు సెల్ఫ్-రిలెంట్ ఇండియా క్యాంపెయిన్ కింద ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల బయోటెక్ రంగం మరింత బలపడింది.

స్టార్టప్‌లతో యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది. స్టార్టప్ ఇండియా ,, అంతరిక్ష రంగానికి ఇన్- స్పేస్ , డిఫెన్స్ స్టార్టప్‌ల కోసం ఐడెక్స్ , సెమీకండక్టర్ల కోసం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్, యువతలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హ్యాకథాన్ఇండియా , బయోటెక్ స్టార్ట్ -అప్ ఎక్స్‌పో కావచ్చు ఇలా ఎన్నో దేశాన్ని ముందుడగు వేసేందుకు దోహదం చేశాయి. మెడికల్ ఇన్‌ఫ్రా నుండి వ్యాక్సిన్ పరిశోధన , వ్యాక్సిన్ తయారీ నుండి టీకా వరకు ఎవరూ ఊహించని ప్రగతి సాధించింది. దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను దేశప్రజలకు అందించిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద గ్రామాలు మరియు పేదలకు వైద్యం మరింత అందుబాటులోకి రాగా ఫార్మాతో పాటు వ్యవసాయం, ఇంధన రంగంలో భారత్ తీసుకొస్తున్న పెను మార్పులు బయోటెక్ రంగానికి కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.
Also Read:పొత్తుకు పవన్ వెనుకడుగు.. కారణం అదే?

