737 మంది పాలస్తీనియన్ల విడుదల..

1
- Advertisement -

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బందీల విడుదలకు ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది. తమ వద్ద బందీలుగా ఉన్న 737 మంది పాలస్తీనియా పౌరులను విడిచిపెట్టనున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

వివిధ జైళ్లలో ఉన్న బందీలు, ఖైదీలను విడుదల చేయనున్నట్లు ఆ దేశ న్యాయ శాఖ ప్రకటించింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని, అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది.

కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో 737 మంది బందీలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. బందీల్లో తొలి బృందాన్ని ఆదివారం విడుదల చేయడంతో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.

Also Read:వరుస సినిమాలతో బిజీగా నిధి అగర్వాల్

- Advertisement -