నువ్విలా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో హవీష్. తాజాగా రొమాంటిక్ థ్రిల్లర్ కథ సెవెన్‌తో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ఈ మూవీతో నిజార్ షఫీ దర్శకుడిగా పరిచయమవుతుండగా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నారు..?విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం……
కథ:
కార్తిక్ (హవీష్) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన ఆఫీసులో ఉద్యోగం చేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో ఆఫీసులో సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తుతుంది. సీన్ కట్ చేస్తే కార్తిక్ ఇంటి నుంచి వెళ్లిపోతాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది రమ్య. విచారణలో వారికి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి. సేమ్ కంప్లైంట్ జెన్నీ (అనీషా అంబ్రోస్) ,చెన్నైలో మరో యువతి ఇస్తుంది. దీంతో కార్తీక్‌పై చీటింగ్ కేసు నమోదుచేస్తారు పోలీసులు. తర్వాత ఏం జరుగుతుంది…అసలు కార్తీక్ ఎవరు..? ముగ్గురు అమ్మాయిలను కార్తీక్ నిజంగానే మోసం చేశాడా అన్నది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథలో ట్విస్ట్,సినిమాటోగ్రఫీ,రెజీనా నటన. తన అందంతో సినిమాకు మరింత గ్లామర్ తెచ్చింది రెజీనా. ప్రేమ కోసం పరితపించే పాత్రలో ఒదిగిపోయింది. ఇక సినిమాకు మరో ప్లస్ హవీష్. గత సినిమాలతో పోలీస్తే నటనలో వైవిధ్యాన్ని కనబర్చారు. నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్,ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలు. పాటలకు ముందు వెనుక వచ్చే సన్నివేశాల్లో బలం లేకపోవడం మరో మైనస్.సీరియస్‌గా సాగాల్సిన క్లైమాక్స్ సన్నివేశాలు కామెడీగా అనిపించడం నిరాశపరుస్తుంది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ సూపర్బ్. అయితే దర్శకుడిగా మాత్రం కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు, నేపథ్య సంగీతం చిత్రానికి బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది.
తీర్పు:
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సెవన్. కథ, కథనాల్లో కొత్తదనం ఉన్నప్పటికీ వాటికి సరైన డ్రామాని జోడించడంలో చిత్రబృందం విఫలమైంది. రమేష్ వర్మ కథ రాసిన విధానం బాగుంది.ఫస్టాఫ్‌ని మరింత ఆసక్తకరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో కాసింత థ్రిల్ చేసే మూవీ సెవెన్.
విడుదల తేదీ:06/06/2019
రేటింగ్:2.5/5
నటీనటులు: హవీష్, రెజీనా
సంగీతం: చైతన్ భరద్వాజ్
నిర్మాత: రమేష్ వర్మ
దర్శకత్వం: నిజార్ షఫీ