మయాన్మార్‌లో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదుకాగా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శిథిలాలను తొలగిస్తుంటే హృదయ విదారక సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. మయాన్మార్ సైనికులు చెప్పిన వివరాల ప్రకారం 694 మంది మరణించగా 1600 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.
మయాన్మార్‌కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి ప్రకటనతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానంలో 15 టన్నుల సహాయ సామగ్రి (సౌర దీపాలు, ఆహార ప్యాకెట్లు, వంట సామగ్రి) మ్యాన్మార్‌కు పంపినట్లు తెలిపారు.
Also Read:హైదరాబాద్‌లో పడిపోతున్న ఆఫీస్ లీజ్..
భూకంపం అనంతరం థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం ఈ భూకంపం భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చిందని తెలిపింది. చైనా, రష్యా ఇప్పటికే మయన్మార్‌కు సహాయక బృందాలను మరియు సహాయ సామగ్రిని పంపించాయి.