ఎక్సైజ్,రవాణా శాఖలో 677 పోస్టులకు నోటిఫికేషన్…

111
department
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీల వారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది.

ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

503 గ్రూప్‌-1 పోస్టులకు, 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగ‌తా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

- Advertisement -