యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నారప్ప..!

158
venkatesh
- Advertisement -

విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్‌ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

జూలై 14 న ‘నారప్ప’ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 6 లక్షల 50 వేల వ్యూస్‌, 166 లైక్‌లతో నెంబర్‌ 1గా నిలిచింది. ‘నారప్ప’ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా సినిమాలపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఈ చిత్రంలో వెంకటేష్‌ తండ్రి, కొడుకు పాత్రల్లో డ్యూయల్‌ రోల్‌ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ భార్య సుందరమ్మగా ప్రియమణి, వెంకటేష్‌ పెద్ద కొడుకుగా కార్తీక్‌ రత్నం కనిపిస్తారు.

‘నారప్ప’ ట్రైలర్‌లో సన్నివేశాలు, డైలాగ్స్‌ బాగున్నాయి. కానీ కేవలం ట్రైలర్‌తో నారప్ప సినిమా ఫ్లాట్‌ను ఊహించడం కష్టం. ఎందుకంటే సినిమాలో ప్రేక్షకులు ఊహించలేని మలుపులు, ఆశ్చర్యపోయే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇక తండ్రి కొడుకులు గా విక్టరీ వెంకటేష్‌ అద్భుతంగా నటించారు. విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్‌లో విద్య గొప్పదనం, ప్రాముఖ్యత గురించి సీనియర్‌ వెంకటేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఆసక్తికరంగా, ఆలోచించదగినవిగా ఉన్నాయి. మణిశర్మ సంగీతం ఇంప్రెసివ్‌గా ఉంది.ఈ చిత్రానికి శ్యామ్‌ కె నాయుడు సినిమాటోగ్రఫర్‌.

- Advertisement -