నా పిల్లలను అటువైపు వెల్లనివ్వను…

254
- Advertisement -

ఐటెం గార్ల్ సన్నిలియోన్ పిల్లల విషయంలో ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటుంది. తన ముగ్గురు పిల్లలను పోర్న్ వైపు వెల్లనివ్వనని తెలిపింది. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులకి ఈ మ‌ధ్య స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌లు జ‌న్మించారు. ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్‌లతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని సన్నీ తెలిపింది. తన పిల్లల భవిష్యత్ గురించి ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

sunny-leone-nisha-

ఒక్కొప్పుడు పోర్న్ గర్ల్ గా చేసిన సన్నీలియోన్ ప్రస్తుతం వాటిని వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టింది. పోర్న్ గర్ల్ చెయ్యటానికి మా అమ్మానాన్న నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని దాంతో పోర్న్ గ్రఫీకి వెళ్లానని చెప్పింది. నా పిల్ల‌ల‌ని పోర్న్‌గ్ర‌ఫీ వైపు అస్స‌లు వెళ్ల‌నీయ‌నని సన్నీ తెలిపింది. వాళ్ల కెరీర్ విషయంలో స్వతంత్రంగా వదిలేస్తానని సన్నీ చెప్పుకొచ్చింది. పోర్నో లోకి వెళ్లడం తనకు ఎలాంటి అసంతృప్తి కల్గలేదని కానీ సమాజంలో పలువురు నన్ను అసహ్యించుకొనేవారని, మరి కొందరు తిట్టేవారిని హాట్ బ్యూటీ వెల్లడించింది.

హాట్ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే విపరీతమైన క్రేజ్ ఏర్పర్చుకుంది. రూ.150 కోట్లతో వీరమాదేవీ అనే ఫుల్ ప్లెడ్జ్‌డ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెర‌కెక్కుతుంది. తెలుగు, తమిళ, మలయాళం,హిందీ భాషల్లో రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వి.సి.వడివుడయన్ తెరకెక్కిస్తుండ‌గా, స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో వైపు జీ టీవీ గ్రూప్ కరెంజిత్ టు సన్నీ అనే పేరుతో బయోపిక్ రూపొందిస్తుంది. ఇందులో పోర్న్ కు ముందు సన్నీ, ఆ తర్వాత సన్నీ ఎదుర్కొన్న అంశాలను చూపించనున్నారట.

- Advertisement -