రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సభ సజావుగా సాగనందుకు ఎన్డీఏ, దాని మిత్రపక్ష పార్టీ ఎంపీల కీలక నిర్ణయం. 23 రోజుల వేతనాన్ని తీసుకోకూడని నిర్ణయించుకున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడానికే తామంతా ఇక్కడకు వచ్చామని… అలా సేవచేయలేన్నపుడు ప్రజల సొమ్ము తినేహక్కు ఎవ్వరికీ లేదని అనంత్ కుమార్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా సభలో గందరగోళం సృష్టిస్తోందని అనంత్ కుమార్ విమర్శించారు. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ, అన్నాడీఎంకేలతో పలు పార్టీలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయసభలు సజావుగా సాగకుండా ప్రతిరోజూ వాయిదా పడుతున్నాయి.
ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ మినహా ముఖ్యమైన బిల్లులేవీ ఆమోదం పొందని విషయం తెలిసిందే. ,సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్-2016, నేషనల్ మెడికల్ కమిషన్ బిల్-2017 పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.
.