విభిన్న కథలకు పెద్దపీట వేస్తూ తెలుగు పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ తాజా మరో సినిమాను చేస్తున్నాడు. యూత్ ఫుల్ డైరెక్టర్ హను రావుపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు అనే సినిమాను చేస్తున్నాడు. ఫిదా చిత్రంలో అందరిని ఫిదా చేసిన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్‌పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్ లో తన 28వ సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. హలో ఫేం కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో కథానాయిక. తొలి షెడ్యూల్ లో హీరో హీరోయిన్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీరించనున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీ శర్వానంద్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని టీం భావిస్తుంది. ఈ ఏడాది చివరిలో మూవీ రిలీజ్ చేసేలా టీం కసరత్తులు చేస్తోంది.