మహిళలలు ధైర్యంగా లైంగిక వేధింపులను ఎదిరించాలని, మహిళలకు అండగా షీ టీమ్స్ ఉన్నాయని షీ టీమ్స్ ఇంఛార్చ్ గోయెల్ తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద భోలక్పూర్ కు చెందిన నదీమ్ జానీ, అజారుద్దీన్ లు అనే వ్యక్తులు స్థానికంగా పనిచేస్తున్న ఓ మహిళలను వేధిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన షీ టీమ్స్ ఆమెను అసభ్యకరంగా వేధిస్తున్న వీడియో రికార్డు చేశారు. అనంతరం ఆ యువకులపై పెటీ కేసు నమోదు చేసి నిందితులకు కౌన్సిలింగ్ నిర్వించారు. కోర్టులో హాజరుపర్చగా నిందితులకు న్యాయస్థానం రెండు రోజుల పాటు సామాజిక సేవ చేయాలని శిక్ష విధించింది.
కిమ్స్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని 15 రోజులుగా ఓ యువుకుడు వేధిస్తుండడంతో ఆమె షీటీమ్స్ ని ఆశ్రయించింది. దాంతో రంగంలోకి దిగిన షీటీమ్స్ నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారించగా సికింద్రబాద్ రాంగోపాల్ పేట్ కు చెందిన అమిత్ జహార్యాగా తేలింది. నిందితుడికి సామాజిక సేవచేయాలని కోర్టు తీర్పునిచ్చింది. సమాజంలో మహిళలపై జరుగుతున్న వేధింపులను తేలికగా తీసుకోవద్దని, అండగా షీ టీమ్స్ ఉన్నాయనే విషాయాన్ని మహిళలు గుర్తుచేసుకోవాలని గోయెల్ తెలిపారు.
సమాచారం ఇచ్చిన వారి పేరు, వివరాలు, బాధితుల పేరు, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఏ సందర్భంలోనైనా బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి డయల్100, హాక్ఐ, హైదరాబాద్ వాట్సాప్ 9490616555, హెచ్‌వైడీషీటీమ్<\@>జీమెయిల్.కాం, షీ టీమ్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా కానీ నేరుగా షీ టీమ్స్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు.