ఈ ఏడాది ఐపీఎల్ జరగకుండా ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ జరగకుండా బీసీసీఐ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని సంపత్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి పిల్లో పేర్కొన్నారు.
ఓ విచారణ అధికారిగా ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్‌ను బయటపెట్టానని పిల్లో పేర్కొన్నారు. ఐపీఎల్లో ఆడే 8 జట్లను ప్రతివాదులుగా సంపత్ కుమార్ చేర్చారు. గతంలో బెట్టింగ్ స్కామ్‌లో బుకీల నుంచి లంచాలు తీసుకున్నారన్న అరోపణలపై సంతపత్ కుమార్‌ను నాలుగేళ్లపాటు సస్పెండ్ చేశారు.
ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేయడంతో మళ్లీ విధుల్లోకి హాజరైన సంపతకుమార్. ఐపీఎల్‌ను నిరోదించమని తాను అనడం లేదని, ఐపీఎల్ కొత్త సీజన్ మొదలయ్యే ముందుబెట్టింగు నిరోదించే కమిటీ ఏర్పాటు చేయాలని తన వినతి అని పిల్లో సంపత్ పేర్కొన్నారు.
ఈ వ్యవస్థను ఏర్పాటు చేయకుండ బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్లో కోరారు. ఈనెల 7నుంచి ఐపీఎల్ 11వ సీజన్ మొదలవనున్న సంగతి తెలిసిందే.