ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదు..

70

ఏపీలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 1,00,001 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,646 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,098 కొత్త కేసులు నమోదు కాగా, అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 127 కేసులు గుర్తించారు. చిత్తూరు (890), పశ్చిమ గోదావరి (761) జిల్లాల్లో 500కి పైన కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 12,319కి పెరిగింది. ఏపీలో ఇప్పటిదాకా 18,50,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 17,75,176 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 63,068 మంది చికిత్స పొందుతున్నారు.