- Advertisement -
ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రలో విషాదం నెలకొంది. ఎండవేడిమికి తట్టుకోలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారని అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఈజిప్టు నుండి వచ్చిన 323 మంది హజ్ యాత్రికులు వేడి-సంబంధిత అనారోగ్యాల కారణంగా మరణించారని తెలిపారు.
ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు.మక్కాలోని అతిపెద్ద శవాగారాల్లో ఒకటైన అల్-ముయిసం వద్ద మొత్తం 550 మృతదేహాలు ఉన్నాయని దౌత్యవేత్తలు తెలిపారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదన్నారు.
Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!
- Advertisement -