ఏపీలో కొత్తగా 534 మందికి కరోనా పాజిటివ్..

57
corona

ఏపీలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 534 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 130 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 74, గుంటూరు జిల్లాలో 54, పశ్చిమ గోదావరి జిల్లాలో 51 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13, విజయనగరం జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 498 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,77,348 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,65,825 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. 4,454 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,069కి చేరింది.