సీఎం కేసీఆర్‌కు 52 దేశాల ఎన్నారైల మద్దతు..

198
nri
- Advertisement -

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ 52 దేశాల ఎన్నారైలు మద్దతిచ్చారు. బీఆర్ఎస్ ఎన్నారై సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు మహేష్ బిగాల. అన్ని దేశాల ఎన్నారై ప్రతినిధులు ముక్తకంఠంతో బీఆర్ఎస్ కు మద్దతు పలికారు.

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎన్నారైల మద్దతు ప్రకటించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం ఉంది అని అందరు ఎన్నారైలు బీఆర్ఎస్ ను ముక్తకంఠంతో స్వాగతించారని తెలిపారు మహేష్. కేసీఆర్‌ తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ దేశ భవిష్యత్‌ను మార్చబోతుందన్నారు.

బీజేపీ ముక్త్‌ భారత్‌ నినాదంతో కేసీఆర్‌ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. విదేశాల్లో ఉన్న వారందరికీ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో వివరించి, మద్దతు కూడగడుతామన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని, రాష్టాన్ని అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ దేశానికి అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనిల్ కూర్మాచ‌లం పాల్గొన్నారు.

- Advertisement -