5 నిమిషాలు ఇలా చేయండి..బరువు తగ్గండి!

14
- Advertisement -

ఈ మధ్యకాలంలో చాలమందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు పెరగడం. తినే ఆహారంలో మార్పుల కారణంగా కొద్దిగా తిన్నప్పటికి విపరీతంగా బరువు పెరుగుతుంటారు. అంతే కాకుండా శారీరక శ్రమ తగ్గడం.. గంటల తరబడి కూర్చొని పని చేయడం వంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు పెరుకుపోయి ఉబకాయానికి దారి తీస్తుంది. దీంతో బరువులు తగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు.కానీ పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు.

అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు. ప్రతిరోజూ కనీసం ఐదు నిమిషాలు వాకింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ వాకింగ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉండటమే కాదు బరువు తగ్గడానికి సహాయపడుతుందని వెల్లడించారు.

వాకింగ్ వల్ల ఒత్తిడి హార్మోన్ల కార్యకలాపాలు తగ్గుతాయి. ఇ పడుకునే ముందు ప్రతిరోజూ నడవడం మంచిది. ఇది నిద్ర స్థాయిని పెంచి శరీరం సమతూల్యంగా ఉండటంలో సాయపడుతుంది. వాకింగ్ రక్తపోటును అదుపులో ఉంచడమే కాదు కొలెస్ట్రాల్ ను తగ్గించి..దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. అంతేగాదు తిన్న అన్నం సులభంగా జీర్ణమయ్యేందుకు నడక దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సో ప్రతిరోజు నడక ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Also Read:తిరుమలలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..

- Advertisement -