బతుకమ్మ పండగలో ప్రథమ స్థానం పూలదే. ఏటి గట్లపై, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వుతో.. తీరు తీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు. తంగేడు, బంతిపూలు, చేను చెలకలలో పెరిగే గునుగుపూలు, పట్టుకుచ్చులు, ముళ్ళకంచెలపై కనిపించే కట్లపూలు, పెరట్లో పెరిగే మందారాలు, గన్నేరు.. గుమ్మడి.. ఒక్కటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మలో కొలువవుతాయి. అందుకే ఈ పండగ ప్రకృతిని ఆరాధించే చిహ్నంగా కీర్తిపొందుతోంది.
నాలుగోరోజు జరుపుకునే బతుకమ్మ నానెబియ్యం బతుకమ్మ. ఇవాళ గౌరమ్మను చేసి తంగేడు వివిధ పూలతో అలంకరించి, వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు..ఇది నానబియ్యం బతుకమ్మ ప్రత్యేకత.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడలా బతుకమ్మ పాటలతో మార్మోగిపోతున్నాయి. ప్రజలంతా సంతోషంగా బతుకమ్మ పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Also Read:కాజల్‌కి ఆ సమస్య ఉందట