ఈ పులికి తమిళం వచ్చు….

223
White tiger from Chennai zoo gets new home in Udaipur; one hitch - it knows only Tamil
White tiger from Chennai zoo gets new home in Udaipur; one hitch - it knows only Tamil
- Advertisement -

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ తెల్లపులికి తమిళం భాష వచ్చు… పులికి భాష ఏమిటి.. అందులోనూ తమిళం రావడం ఏమిటి.. అని కంగారు పడకండి. అవును ఇప్పుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న సజ్జన్‌గఢ్‌ బయొలాజికల్‌ పార్క్‌ సిబ్బందికి ఇదో పెద్ద సమస్య అయింది. అధికారులు జంతువుల మార్పిడి కార్యక్రమం కింద తమిళనాడు జూ కి రెండు తోడేళ్లను ఇచ్చి అక్కడి నుంచి రామా అనే తెల్ల మగపులిని ఉదయ్‌పూర్‌ తెచ్చుకున్నారు. దాని రాకతో జూ కళకళలాడుతోంది. అంతవరకు బాగానే ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది.

Central Zoo Authority

హిందీ ఉత్తరాది భాష. దక్షిణాదిలో ఉన్న చాలామందికి హిందీ రాదు. ఎవరైనా హిందీలో అదే పనిగా మాట్లాడితే.. రానివారికి చిరాకు వేస్తోంది. మరీ తమిళ భాషకు అలవాటు పడిన ఓ పులికి అదే పనిగా హిందీలో ఆదేశాలిస్తే అది ఊరుకుంటుందా?..

Central Zoo Authority

తమిళులకు మాతృభాష పట్ల ఉండే అభిమానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! అయి తే, ఈ భాషాభిమానం మనుషులకే కాదు.. ఇక్కడ పుట్టి పెరిగిన జంతువుల్లోనూ ఉంటుందని ఓ పులి చాటుతోంది. తమిళంలో తప్ప మరే భాషలో చెప్పినా ఆహారం మట్టనంటోంది! దీని తీరు తో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జూ నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

Central Zoo Authority

చెన్నైలోని వండలూరు జంతు ప్రదర్శనశాలలో 2011లో ఓ మగ పులి జన్మించింది. దీనికి జూ సిబ్బంది ‘రాముడు’ అని పేరు పెట్టారు. ఐదేళ్లుగా సిబ్బంది తమిళంలో చేసే సూచనలకు ఇది బాగా అలవాటు పడింది. తమిళం రాముడికి మాతృభాషగా మారిపోయింది. అయితే, ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న సజ్జనగార్‌ జంతుపదర్శనశాలలోని ‘దామిని’ అనే ఆడపులికి జత కోసం ‘రాముడి’ని తీసుకెళ్లారు.

అయితే ఈ జూలోని సిబ్బంది హిందీలో చేసే సూచనలు రాముడికి ఏ మాత్రం అర్థం కావడం లేదు. మాంసం పెట్టి ‘ఖావో’ అన్నా తినకుండా పక్కకు వెళ్తోంది. ‘ఇంగెవా…అంగెపో’ (ఇక్కడికి రా…అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి ‘పులిరాజ’కు ఒక్కసారిగా ‘యహా ఆవో… వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది.

అందుకే సజ్జన్‌గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని ‘రామ’ గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. తమిళ తెల్లపులితో వేగడం ఇక తమవల్ల కాదని, తమిళం తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించామని జూపార్కు సూపరింటెండెంట్ మోహన్‌రాజ్ ఇటీవల చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు ఉత్తరం రాశారు. తమ సిబ్బందికి తమిళం నేర్పించి ‘రామా‘ను మచ్చిక చేసుకునే వరకు సహకరించాలన్నారు.

- Advertisement -