చైతూతో పెళ్లి ఖరారు చేసుకున్న సమంత హిందూ మతంలోకి మారిందా? ఈ విషయానికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్కు సమంత కూడా హాజరైంది.
ఇందులో చైతన్య, సమంత ఇద్దరూ కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే చాప మీద కూర్చున్నారు. పక్కన నాగార్జున కూడా ఉన్నారు. మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం పెద్ద విశేషం కాకపోయినా.. సమంత కుంకుమ బొట్టు పెట్టుకోవడంతోనే అందరూ ఆమె హిందూ మతం పుచ్చుకుందని చెబుతున్నారు.
అక్కినేని ఫ్యామిలీలోకి సమంత రాకకు ఒక్కొక్క అడుగు పడుతుంది. క్రిస్టియన్ అయిన సమంత.. నాగ చైతన్యతో పెళ్లి కోసం హిందూ మతంలోకి మారింది. నాగచైతన్య, సమంత ఇద్దరూ పూజలు, హోమాలు చేశారు. నాగార్జున దగ్గరుండి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసే యోచనలో ఉన్నారనే సంగతి తెలిసిందే.. ఇప్పటికే అఖిల్ నిశ్చితార్ధపు తేదీ డిసెంబర్ 9న అని ప్రకటించారు. కాగా పెద్ద తనయుడు నాగ చైతన్య పెళ్లి గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు.. చైతు ఎప్పుడంటే అప్పుడు నేను పెళ్లి చెయ్యడానికి రెడీ అని చెప్పారు.. కాగా నాగ చైతన్య సమంతలు వేద పండితుల మధ్య కూర్చుకొని పూజ జరిపించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ ఫోటోలో నాగార్జున దగ్గరుండి మరీ పూజను చేయిస్తున్నట్లు ఉన్నది. దీంతో చైతు, సామ్ ల నిశ్చితార్ధం సింపుల్ గా జరిగిపోయిందా…! లేక ముందుగా వార్త హల్ చల్ చేసినట్లు.. వీరిద్దరూ రాహు కేతు పూజ చేశారా అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్ గా వినిపిస్తోంది.
పూజల తర్వాత నాగ్ తో కలిసి కొత్త జంట ఫొటో దిగింది. ఈ కార్యక్రమం తిరుమలలో జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ నుంచి క్లారిటీ రాలేదు.
ఏది ఏమైనా సమంత లాంటి మంచి మనసున్న అమ్మాయి.. వివాద రహితుడైన చైతుకి భార్య కావడం అందరికీ ఆనందం ఇస్తోంది. పైగా మనం సినిమా సమయం నుంచి సమంతను నాగార్జున అమ్మని పిలుస్తారు అని ప్రకటించారు. దీంతో తనకు ఇష్టమైన అమ్మని తన పెద్ద కోడలుగా తెచ్చుకోవడానికి ఇద్దరు కలకాలం కలిసి ఉండడానికి నాగార్జున తగు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.