అధికారులూ… ప్రాణ నష్టం జరగొద్దు….

237
KCR-
KCR-
- Advertisement -

భారీ వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆస్తి నష్టం జరిగితే ఎలాగోలా పూడ్చుకోవచ్చు.. కానీ ప్రాణ నష్టం జరిగితే పూడ్చలేమని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు.

 Telangana CM

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ సమాచారం సేకరించాలన్నారు. అవసరమైన సూచనలను చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

KCR-1

భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించాలని ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల మనషులు, పశువులు ప్రాణాలు కోల్పోకుండా కాపాడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు.

అధికారుల సూచనలు పాటించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండి కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు వచ్చిన సమాచారం ఆధారంగా స్పందించాలని సూచించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

KCR-1

గోదావరి నది ఉప్పొంగుతోంది.. ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుందన్నారు. రాష్ట్రంలోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, సింగూరుతో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ నిండాయి. ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేస్తున్నందున గోదావరికి గంట గంటకూ నీటి ప్రవాహం పెరుగుతూనే ఉందన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదులు, వాగులు, వంకల ద్వారా పెద్ద ఎత్తున గోదావరిలో నీరు చేరుతోంది. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -