ఏపీకి 4 కేంద్రమంత్రులు?

16
- Advertisement -

ఎన్డీయే కూటమి పక్ష నేతగా ఎన్నికయ్యారు నరేంద్ర మోడీ. ఈ నెల 8న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా జవహర్ లాల్ నెహ్రు తర్వాత మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన రెండో నేతగా రికార్డు నెలకొల్పనున్నారు మోడీ.

ఇక అప్పుడే కేంద్రమంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అందులో ఏపీ నుండి ఎవరికి ఛాన్స్ ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్డీయేలో బీజేపీ తర్వాత కీలకంగా మరారు చంద్రబాబు.

దీంతో ఈసారి ఏపీకి ఎక్కువగా కేంద్రమంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏపీకి నాలుగు కేంద్రమంత్రి పదవులు దక్కనుండగా ఇందులో ఒకరు బీజేపీ ఎంపీ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ కింజారాపు రామ్మోహన్ నాయుడు,జనసేన ఎంపీ బాలశౌరి,టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు లేద చంద్రశేఖర్, బీజేపీ నుండి పురందేశ్వరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ నుండి కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Also Read:మనమే..రన్ టైం లాక్..!

- Advertisement -