- Advertisement -
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొలిర్‌విలీలోని ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు.
వీరిలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ కుమార్తెలు సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14)గా ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇంటికి అలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయిందన్నారు. అమెరికాలో చదువుకుంటున్న వీరంతా క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో బంధువులైన డానియెల్, కరీ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
- Advertisement -