నాలుగు రోజుల పాటు వానలు

138
rains
- Advertisement -

రాష్ట్రంలో నాలుగురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరం నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీన పడినట్లు ఐఎండీ అధికారులు వివరించారు. వచ్చే ఐదు రోజుల్లో దక్షిణ భారతంలోని పుదుచ్చేరి, కరైకాల్‌, కర్ణాటక, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడతాయని వెల్లడించారు.రాష్ట్రానికి వర్ష సూచనలతో అన్నదాతల్లో భయం మొదలైంది. పంట చేతికొచ్చిన ఈ సమయంలో వర్షాలు, వడగండ్ల వానలు పడితే తమకు తీవ్ర నష్టం తప్పదని ఆవేదన చెందుతున్నారు.

దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వానలు, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి.

- Advertisement -