- Advertisement -
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు షాక్ తగిలింది. హెచ్‌సీఏలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి. హెచ్‌సీఏ భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపణల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.
ఇక తనపై నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోసం మల్కాజ్గిరి కోర్టును ఆయన ఆశ్రయించారు అజార్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని అజారుద్దీన్‌పై ఆరోపణలు వచ్చాయి.
అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో రాచకొండ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read:ప్రోటీన్ల కోసం ఇవి తినండి…
- Advertisement -