శ్రీ‌వాణి ట్ర‌స్టు… 3,615 ఆల‌యాల నిర్మాణం

44
- Advertisement -

టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) ద్వారా 3,615 ఆల‌యాల నిర్మాణం, ప‌లు ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో గురువారం ఆల‌యాల నిర్మాణంపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 1500 ఆల‌యాల నిర్మాణం పూర్త‌యింద‌ని, మిగిలిన ఆల‌యాల నిర్మాణాన్ని వ‌చ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాల‌ని అధికారులను కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ 1973 ఆల‌యాల‌ను నిర్మించింద‌న్నారు. స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్ 320 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టి 307 ఆల‌యాల‌ను పూర్తి చేసింద‌ని చెప్పారు.

అదేవిధంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు క‌మిటీలుగా ఏర్ప‌డి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆల‌యాల నిర్మాణానికి ఆర్థిక‌సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు. వీటితోపాటు ప‌లు న‌గ‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాలు నిర్మించామ‌ని తెలియ‌జేశారు. స‌మ‌ర‌స‌త సేవ ఫౌండేష‌న్‌కు మ‌రికొన్ని ఆల‌యాల నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు యోచిస్తున్నామ‌న్నారు.

Also Read:ఇంటెన్స్ లుక్‌లో అడివి శేష్

- Advertisement -