3 భాషల్లో ’35-చిన్న కథ కాదు’

25
- Advertisement -

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ విశ్వదేవ్ ను ప్రసాద్ గా పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. విశ్వదేవ్ ను కేరింగ్ అండ్ రెస్పాన్స్ బుల్ మిడిల్ క్లాస్ ఫాదర్ గా ప్రజెంట్ చేసిన ఈ గ్లింప్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. విశ్వదేవ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ చాలా క్యురియాసిటీని పెంచింది.

స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది.పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్‌ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.”35-చిన్న కథ కాదు” ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Also Read:హాయ్ జగన్…వైసీపీ అధినేతతో రఘురామరాజు

- Advertisement -