ఈడెన్ గార్డెన్ స్టేడియంలో న‌్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 227 పరుగులు చేసి ఓవరాల్‌గా 339 పరుగుల ఆధిక్యంలో ఉంది. పేస్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై బ్యాటింగ్ కష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లోనూ కోహ్లి సేన విజయం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. వరుసగా అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఒక దశలో 30.3 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసిన టీం ఇండియాను రోహిత్‌శర్మ (82), సాహా (39 నాటౌట్) ఆదుకున్నారు.
టెస్టుల్లో ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (45) ఆదివారం రెండో టెస్టులో మెరుగ్గా ఆడినా.. అంపైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది.
ఇక రెండో టెస్ట్ కూడా టీమిండియా గెలిస్తే… సిరీస్‌తో పాటు నెంబర్ వన్ ర్యాంక్ సైతం కోహ్లీ సేనకు దక్కుతుంది. ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్‌లో ఏ జట్టు కూడా 233 పరుగుల కంటే ఎక్కువగా నమోదు చేయలేదు. టీమిండియా ఇప్పటికే 339 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్‌కు ఇంకో రెండు రోజుల ఆటతోపాటు రెండు వికెట్లు చేతిలో ఉన్నాయి. కివీస్ కు350పైనే టార్గెట్ ఉండనుంది. దీని ప్రకారంగా చూస్తే భారత గెలుపు ఖాయంగా కనబడుతోంది.