‘డేరా’ హింసాకాండ……31 మంది మృతి

172
31 dead- 250 injured
- Advertisement -

అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ డేరా స్వచ్ఛ సౌదా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉత్తరభారతంలోని హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ సృష్టించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.

ఈ ఘటనలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా 350 మందికి గాయాలయ్యాయి. నాలుగు రాష్ట్రాల్లో బాబా అనుచ‌రులు బీభ‌త్సం సృష్టించారు. ఢిల్లీలో రైలు త‌గ‌ల‌బెట్టారు. పంచ‌కుల‌లో మీడియా ఓబీ వ్యాన్ల‌కు నిప్పుపెట్టారు. రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు సుమారు ప‌దేళ్ల జైలు శిక్ష‌ప‌డే అవ‌కాశాలున్నాయి.

31 dead- 250 injured
పంజాబ్‌లో 75 కంపెనీల కేంద్ర బలగాలు, హర్యానాలో 35 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. పంజాబ్‌, హరియాణాలోని అనేక ప్రాంతాల్లో బస్సు సర్వీసులు రద్దు చేశారు. సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌, డేటా సేవలను నిలిపివేశారు.

గుర్మీత్‌పై తీర్పు అనంతర హింసాత్మక ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను అదుపు చేయడానికి చేపట్టిన చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

31 dead- 250 injured

- Advertisement -