నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. గ్రూప్-1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు, వైద్య, ఆరోగ్యశాల్లోని పోస్టులతో పాటు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
టీఎస్‌పీఎస్సీ ద్వారా 503 గ్రూప్-1 పోస్టులు, పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీస్‌శాఖలో 16,587 పోస్టులు, రవాణాశాఖలో 63 పోస్టులను పోలీస్‌శాఖ ద్వారా, టీఎస్ పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్ అసిస్టెంట్లు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది.
టీఎస్‌పీఎస్సీ ద్వారా వైద్యారోగ్యశాఖలో 2,662, రవాణాశాఖలో టీఎస్‌పీఎస్సీ ద్వారా 149, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూమెంట్ బోర్డు ద్వారా 10,028 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.