- Advertisement -
రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో, వినూత్న కార్యక్రమాలతో దూసుకువెళ్తున్నది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ యేడాది మరింత విభిన్నంగా మొదలు కాబోతోంది. నాలుగవ ఏట అడుగు పెట్టి, దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా అసోసియేషన్ ఆఫ్ సోషల్ బియాండ్ బౌండరీస్ వారి ఆధ్వర్యంలో షాపూర్ లోని గైదారా గ్రామంలో 300 మొక్కలను నాటారు.
- Advertisement -