అప్పుడు ఎన్టీఆర్…ఇప్పుడు పవన్‌:పృథ్వీ

137
Prudhvi
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై ప్రశంసలు గుప్పించారు థర్టీ ఇయర్స్ పృథ్వీ రాజ్. పవన్ నటించిన భీమ్లా నాయక్‌ విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్‌ షేక్ చేస్తోంది. పవన్ సునామీతో కలెక్షన్ల వర్షం కురుస్తుండగా తాజాగా సినిమా చూసిన పృథ్వీ…పవన్‌ని ఆకాశానికి ఎత్తేశాడు.

భీమ్లా నాయక్ చిత్రాన్ని తాడేపల్లిలో చూశాను… అప్పుడెప్పుడో రామారావు నటించిన అడవి రాముడు సినిమాకి ఇంత భారీగా జనాలు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకే ఇంత మంది ని చూస్తున్నానని తెలిపారు.ఈ సినిమాతో పవన్ కి దిష్టి తగిలి ఉంటుందన్నారు.

పవన్ పెద్ద సక్సెస్ అందుకున్నందుకు సంతోషంగా ఉందని….ఆయన అభిమానులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇలాంటి మంచి సినిమాలో భాగం అవ్వనందుకు బాధగా ఉందని తెలిపారు పృథ్వీ.

- Advertisement -