సీఎంగా చంద్రబాబు.. నేటికి 30 ఏళ్లు!

4
- Advertisement -

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేపట్టి నేటికి 30 సంవత్సరాలు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు సీఎంగా.. 8 ఏళ్ల 8 నెలల 13 రోజులు సీఎంగా వ్యవహరించారు చంద్రబాబు.

ఇక మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు ,నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి నేటి వరకు సీఎంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. నేటివరకు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు.. అంటే 5,442 రోజులు సీఎంగా చంద్రబాబు ఉన్నారు.

15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించారు చంద్రబాబు. హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలు మార్చారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read:యాద‌గిరిగుట్ట సేవ‌ల‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు

నేటికీ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. రాజంపేటలో పెన్షన్లు పంపిణీలో పాల్గొనన్నారు చంద్రబాబు.

- Advertisement -