ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఘనంగా జాతీయ నీటి పథకం మొదటి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, కేంద్ర జల్ శక్తి సహాయమంత్రి రతన్ లాల్ కటారియా, జాతీయ నీటి పథకం డైరెక్టర్ అశోక్ కుమార్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యాయరు.
తెలంగాణ రాష్ట్రానికి వివిధ విభాగాల్లో మూడు అవార్డులు లభించాయి.సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కు ద్వితీయ అవార్డు..
నీటి వినియోగ సామర్థ్యాన్ని 20శాతం పెంచడంలో మిషన్ భగిరథకు ప్రథమ అవార్డు..భూగర్భజలాలు ప్రమాదకర స్థితిలోకి చేరిన ప్రాంతాల పునరుజ్జీవనానికి ప్రత్యేక దృష్టి పెట్టడంపై రాష్ర్ట భూగర్భజల విభాగానికి తృతీయ అవార్డు లభించింది.కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా అవార్డులు అవార్డులు అందుకున్నారు. ప్రభుత్వ అధికారులు.