AP:ఆ మూడు జిల్లాలకు వరదముప్పు!

5
- Advertisement -

ఏపీలోని ఆ మూడు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. శుక్రవారం ఉదయం పారాదీప్- గోపాలుర మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉన్నట్లు సమాచారం.

తీరం వెంబడి 50-70 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…మత్స్యకారులు మూడు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

- Advertisement -