పుష్ప 2 తొక్కిసలాట..ముగ్గురి అరెస్ట్

1
- Advertisement -

పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురు అరెస్ట్ చేశారు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్ అరెస్టైన వారిలో ఉన్నారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని జుడీషియ‌ల్ రిమాండ్ కు పంపించారు.

చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య 70 మిమి థియేటర్ లో 4 డిసెంబర్ న‌ జరిగిన జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లోఓ మహిళ మరణించిన సంగ‌తి తెలిసిందే. ఘటనే ఆదివారం రాత్రి భారీ హంగామా మరియు నిర్లక్ష్యంగా ఉన్న భద్రతా చర్యల కారణంగా ఆమె మ‌ర‌ణం సంభ‌వించింద‌ని పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆ రోజు పోలీసుల‌కున్న‌సమాచారం ప్రకారం, పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోకు భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు, కేవలం సినిమా చూసేందుకు మాత్రమే కాదు, సినిమాకు ముఖ్య పాత్రధారులు థియేటర్‌కు రానున్నట్లు ఊహిస్తూ వారంతా ఇక్క‌డ‌కు చేరుకున్నారు. సినిమా నటులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు రానున్నార‌న్న సమాచారం సినిమా టీమ్ నుండి కానీ థియేటర్ నిర్వాహకుల నుండి కానీ త‌మ‌కు రాలేద‌ని పోలీసులు తెలిపారు.

సాధారణంగా సినిమా ప్రదర్శనలకు ఉన్న భద్రతా చర్యలు అందరికీ సరిపడేలా చూడాలి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అనే ప్రముఖ హీరో, తన వ్యక్తిగత భద్రతా బృందంతో రాత్రి 9:30 గంట‌ల‌కు వద్ద సంధ్య 70 మిమి థియేటర్ కు వచ్చార‌ని, దాంతో ప్రేక్షకులు థియేటర్ లో ప్రవేశించడానికి ఉత్సాహంగా ముందుకు దూసుకుపోయారు, దీంతో పరిస్థితి అదుపు త‌ప్పి మరింత తీవ్రం అయ్యింది. అల్లు అర్జున్ మరియు ఆయన భద్రతా బృందం ప్రజలను కొంత దూరంగా పుష్ చేయ‌డ‌మే కాకుండా, క్రమరహితంగా అధిక సంఖ్యలో ప్రజలు లోయర్ బాల్కనీ ప్రాంతంలో ప్రవేశించారు. ఈ సమయంలో, రేవతి (35) మరియు ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (13) తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డ్డారు. వారికి ప్రాణభయంగా ఫీలవడంతో, అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే వారిని తీసుకువచ్చి సిపిఆర్‌ చేసి దగ్గర ఉన్న దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్‌లో రేవతి మృతిచెంద‌గా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సెక్షన్ 105,118(1) r/w 3(5) BNS యాక్ట్ కింద విచారణ చేపట్టి పుష్ప2 తొక్కిసలాట కేసులో ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ కు మొత్తం ఏడు మంది యజమానుల్లో ఒకరైన ఓనర్ సందీప్ ను, సీనియర్ మేనేజర్ నాగరాజును అప్పర్, లోయర్ బాల్కనీ చూసుకునే మేనేజర్ విజయ్ చందర్ ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి వారిని జ్యూడిషల్ రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని వివ‌రించారు.

లీగల్ టీం ను సంప్రదించి తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్ కూడా నోటీసులు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. డీసీపీ సెంట్రల్ జోన్ అక్షాంశ్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్న‌తాధికారులు.

Also Read:మసాలా టీ తాగుతున్నారా..అయితే?

- Advertisement -