రియల్ రికార్డు:ఎకరా రూ.745 కోట్లు

527
mumbai real estate
- Advertisement -

గడచిన రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాలతో పాటు ప్రధానంగా ప్రైవేటు రంగంలో ఉపాధి పెరుగుదలకు పట్టణీకరణ దోహదపడింది. పట్టణీకరణ వల్ల ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు పెరగడంతో గ్రామాల్లో ప్రజలు పట్టణాలకు వలసబాట పట్టారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం పట్టణీకరణలో కీలకపాత్ర పోషించింది. ఇక దేశంలో ముంబై,కోల్‌కతా,బెంగళూరు,ఢిల్లీ,హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో రియల్ రంగం జోరందుకుంది.

ఈ నేపథ్యంలో దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనే సంచలన రికార్డు నమోదయింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఎకరా భూమి రూ.745 కోట్లు ధర పలికింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని 3 ఎకరాల భూమిని రూ.2,238 కోట్లతో కొనుగోలుచేసేందుకు జపాన్ కుచెందిన సుమితోమో కంపెనీ బిడ్ దాఖలు చేసింది.

ఈ భూమిని గతంలోనే ముంబై మహానగర ప్రాంతీయ అభివృధ్ది ప్రాధికార సంస్ధ అదికారులు అమ్మకానికి పెట్టారు. అయితే అప్పులు, నగదు కొరత కారణంగా దేశీయ కొనుగోలుదారులు ఎవరూ ముందుకురాలేదు. అయితే ఇటీవల అధికారులు ఆ స్ధలాన్ని మరోసారి వేలానికి పెట్టగా సుమితోమో కంపెనీ ఒక్కడే బిడ్ దాఖలు చేసింది. దీంతో పరిశీలించి అధికారులు భూమి కేటాయింపు చేయనున్నారు.

- Advertisement -