3న ధనుష్ “నారదుడు” 

353

సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం “నారదుడు”.

ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాద రూపమిది. “బిచ్చగాడు” కధానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు మాట్లాడుతూ.. “ధనుష్ పెర్ఫార్మెన్స్, జెనీలియా, శ్రియల గ్లామర్ తో పాటు ప్రతి సన్నివేశంలోనూ పండే కడుపుబ్బ నవ్వించే కామెడీ, విజయ్ ఆంటోని సంగీతం, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు “నారదుడు” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. ధనుష్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా మేళవించిన చిత్రమిది. “అభినవ నారదుడు” లాంటి ధనుష్ పాత్ర ఇటు మాస్.. అటు క్లాస్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరిస్తుంది. సెప్టెంబర్ 3న అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

గీత, శంకరాభరణం రాజ్యలక్ష్మి, భాగ్యరాజా, ఆశిష్ విద్యార్థి, జయప్రకాశ్ రెడ్డి, వివేక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: భువనచంద్ర-వెన్నెలకంటి-శివగణేష్, సంగీతం: విజయ్ ఆంటోని, నిర్మాతలు: ఉమ- వై.వి.సత్యనారాయణ, దర్శకత్వం: జవహర్!!