TTD:వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

21
- Advertisement -

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

మే 22వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి ఉభయనాంచారీ సమేతంగా శ్రీవారు పురవీధుల గుండా వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామిజీ అనుగ్రహభాషణం చేయనున్నారు.

Also Read:ఘనంగా “సిల్క్ శారీ” ప్రీ రిలీజ్

- Advertisement -