ఏపీలో 282 కొత్త కరోనా కేసులు..

165
corona
- Advertisement -

ఆంధ్రపదేశ్‌లో కరోనా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 282 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 442 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 8,80,712 మంది కరోనా బారిన పడ్డారు. 7,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,700 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 8,69,920 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 42,911 మందికి కోవిడ్ టెస్టులు చేశారు.

- Advertisement -