బ్లాక్‌లిస్టులో 28 చైనా కంపెనీలు: బైడెన్‌

220
biden
- Advertisement -

చైనాకు షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. చైనాకు చెందిన 28 కంపెనీల‌ను బ్లాక్‌లిస్టులో చేరారు. ఆ కంపెనీల్లో అమెరిక‌న్లు ఎవ‌రూ పెట్టుబ‌డుటు పెట్ట‌రాదు అని పేర్కొన్న బైడెన్…వాటిల్లో వాటాలు కొనుగోలు చేయ‌వ‌ద్దు అన్నారు.

బైడెన్ తీసుకున్న నిర్ణ‌యంతో బ్లాక్‌లిస్టులో చేరిన చైనా కంపెనీల సంఖ్య 59కి చేరుకున్న‌ది. నిఘా టెక్నాల‌జీకి చెందిన చైనా కంపెనీల‌ను బైడెన్ నిషేధించారు.

గతంలో ట్రంప్ సుమారు 31 చైనా కంపెనీల‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారు. ట్రంప్ పాల‌న స‌మ‌యంలో ఎక్కువ శాతం టెలికాం, నిర్మాణ‌, టెక్నాల‌జీ సంస్థ‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. చైనా మొబైల్, చైనా టెలికాం, వీడియో స‌ర్వియ‌లెన్స్‌, చైనా రైల్వే కార్ప‌రేష‌న్ సంస్థ‌లు ఆ జాబితాలో ఉన్నాయి.

- Advertisement -