
- Advertisement -
నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది .ముష్కరుల దాడిలో 26 మంది సైనికులు మృతిచెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడ్డవారిని రక్షించేందుకు వచ్చిన హెలికాప్టర్ కూడా కూలిపోయింది.
గత కొంత కాలంగా నైజీరియా సైన్యం క్రిమినల్ గ్రూపుతో పోరాడుతోంది. ముష్కరుల దాడిలో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన ఎంఐ-171 హెలికాప్టర్ జుంగేరు నుంచి టేకాఫ్ అయిన తర్వాత కూలిపోయిందని మిలటరీ అధికారులు చెప్పారు
విమానంలో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని అధికారులు వెల్లడించారు.
Also Read:ఆ సమస్యలన్నీ బ్రెయిన్స్ స్ట్రోక్ లక్షణాలే..!
- Advertisement -
