జూన్ ఆఖరివారంలో కూడా థియేటర్ ల్లో కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అలాగే మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం స్ట్రీమింగ్ కానున్న కంటెంట్ పై ఓ లుక్ వేద్దాం రండి
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
‘స్పై’ :
నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె.రాజశేఖర్‌రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. జూన్ 29న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
‘సామజవరగమన’ :
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కించిన చిత్రమిది. రాజేష్ దండా నిర్మాత. రెబా మోనికా జాన్ కథానాయిక. జూన్ 29న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
‘లవ్ యూ రామ్’ :
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ జంటగా నటించిన చిత్రమిది. డి.వి.చౌదరి దర్శకత్వం వహించడంతోపాటు, కథని సమకూర్చిన ప్రముఖ దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి నిర్మించారు. జూన్ 30న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
‘మాయా పేటిక :
పాయల్ రాజ్‌పుత్, సునీల్, శ్రీనివాసరెడ్డి, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక. జూన్ 30న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారాలు ఇవే :
జాక్ ర్యాన్ (వెబ్‌సిరీస్ 4) జూన్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
టైటాన్స్ (వెబ్‌సిరీస్ 4) జూన్ 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) జూన్ 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సీయూ ఇన్‌మై నైన్టీన్త్ లైఫ్ (కొరియన్ సిరీస్) జూన్ 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అఫ్వా (హిందీ) జూన్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సెలెబ్రిటీ (కొరియన్ సిరీస్) జూన్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ+హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :
వీకెండ్ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్) జూన్ 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ది నైట్ మేనేజర్ (సిరీస్2) జూన్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బుక్ మై షో లో ప్రసారాలు ఇవే :
ఫాస్ట్ ఎక్స్ (హాలీవుడ్) జూన్ 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జియో సినిమా లో ప్రసారాలు ఇవే :
సార్జెంట్ (హిందీ సిరీస్) జూన్ 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆహా లో ప్రసారాలు ఇవే :
అర్థమైందా అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) జూన్ 30వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.