26న ‘మజ్ను’ ఆడియో

308
Nani as Majnu
Nani as Majnu

నాని హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘భలే భలే మగాడివోయ్‌’ తర్వాత అదే సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ను రిపీట్‌ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపిసుందర్‌ సారధ్యంలో ‘మజ్ను’ పాటలు రూపొందాయి. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌ నిర్మాణ సారధ్యంలో ‘ఉయ్యాలా జంపాలా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ఈరోజు రేడియో మిర్చి ద్వారా విడుదల చేశారు.

నేచురల్‌ స్టార్‌ నానికి సెప్టెంబర్‌ బాగా కలిసొచ్చిన నెల. అతని మొదటి సినిమా ‘అష్టా చమ్మా’, ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రాలు సెప్టెంబర్‌లో రిలీజ్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. మళ్ళీ ఆ సెంటిమెంట్‌ని మరోసారి నిజంం చేసేందుకు ‘మజ్నుగా సెప్టెంబర్‌లోనే రాబోతున్నారు నాని. ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.

కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. కెమెరా పనితనం, అత్తారింటికి దారేది, సోగ్గాడే చిన్ని నాయనా, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు చేసిన ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ ఎస్సెట్స్‌ కాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.