అల్జీరియాలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది సైనికులు మృతి చెందారు. 300 మంది సైనిక సిబ్బందితో వెళుతున్న విమానం బౌఫారిక్ ఎయిర్ పోర్టు సమీపంలో టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు సమీపంలోని అన్ని రోడ్లను మూసేశారు. అల్జీరియా రాజధాని అల్జీర్స్ సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఆలివ్ చెట్ల మధ్య కూలిపోయిన విమానం తోక భాగం కనిపిస్తుండగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే 20 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని రోడ్లన్నింటినీ మూసేసి సహాయ చర్యలు నిర్వహిస్తున్నారు.
https://twitter.com/Magdashi3/status/983986529205936134