25 రోజుల్లో 23.55 లక్షల కరోనా టెస్టులు…

168
telangana high court
- Advertisement -

ఈ నెల 1 నుండి 25 వరకు 25 రోజుల్లో 23.55 లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని వెల్లడించింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం….ఇంఉలో 4.39 లక్షల ఆర్‌టీపీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

31 మంది కరోనాతో మృతిచెందారని… రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు అత్యల్పంగా 3.5% ఉందని వెల్లడించింది. పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించినట్లు నివేదికలో వెల్లడించింది.

- Advertisement -