- Advertisement -
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలికీ చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు శ్యామ్ జాదుగర్ మనవడు 22 నెలల చిన్నోడు రుషిత్ మ్యాజిక్‌లో ప్రపంచ రికార్డును సృష్టించాడు. నవంబర్ 14న చాచా నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా చాచా నెహ్రు వేష ధారణలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ 10 సెకన్ల కాలంలో శాంతి కపోతాన్ని సృష్టించి దార్ల బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఈ సంధర్బంగా బుక్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ దార్ల నాగేశ్వరరావు నుండీ దృవీకరణ పత్రాన్ని అందుకున్నట్లు శ్యామ్ తెలిపారు. ఈ సంధర్బంగా రుషిత్‌ను పలువురు అభినందించారు.
- Advertisement -