July:బ్యాంకులకు 13 రోజులు సెలవు

9
- Advertisement -

జూలై నెలలో ఏకంగా 13 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సెలవుల వివరాలను పరిశీలిస్తే..3 జూలై 2025- ఖర్చీ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి.అలాగే 5 జూలై 2025- గురు హర్‌గోబింద్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

6 జూలై 2025- ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు, 12 జూలై 2025- నెలలో రెండో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులకు హాలిడే, 13 జూలై 2025- ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులకు వారాంతపు సెలవు, 14 జూలై 2025- బెహ్ దీంక్లాం కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు, 16 జూలై 2025- హరేలా పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

17 జూలై 2025- ఉ తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు,19 జూలై 2025- కేర్ పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు హాలిడే, 20 జూలై 2025- ఆదివారం వారాంతపు సెలవు,26 జూలై 2025- ఈ నెలలో నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు,27 జూలై 2025- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే,28 జూలై 2025- ద్రుక్పా షె జీ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే సెలవు రోజుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేయడం, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ చేయడం వంటి సేవలు బ్యాంకు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయి.

Also Read:కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -