ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ నజీర్. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశామని చెప్పారు. 2027 లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం… అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశాం అన్నారు. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు.
ప్రతి నెల ఒకటో తేదీనే ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం… పెన్షన్లను రూ.4వేలకు పెంచాం అన్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం..వైసీపీ హయాంలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి… డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందన్నారు.
వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం.. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం వంటి విధానాలు అమలు చేస్తున్నాం అన్నారు.
ఇక గవర్నర్ ప్రసంగం సమయంలోనే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
Also Read:ముఖ్యమంత్రిది దిగజారుడు రాజకీయం: కేటీఆర్

